No.1 Short News

Umar Fharooq
ముస్లింల ర్యాలీతో దద్దరిల్లిన దర్శి
కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలని ఈరోజు దర్శి పట్టణంలో ముస్లింలు భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ దర్శి లోని మర్కజ్ మసీదు నుండి అక్సా మస్జిద్ వరకు జరగగా, ముస్లిం సోదరులు,సోదరీమణులు,అందరూ కలిసి తహసిల్దార్ కార్యాలయమునకు చేరుకొని డిప్యూటీ తహసిల్దారు దేవదానం కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లిం సమాజం యొక్క హక్కులను స్వేచ్ఛలను హరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేంతవరకు ఇలానే పోరాడుతూ ఉంటామని తెలియజేశారు.
Latest News
23 Apr 2025 15:51 PM
0
12