

No.1 Short News
Newsreadవక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన దర్శి.
ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలంలోని ముస్లింలు ప్రవాహంగా మారి దర్శిని జనసముద్రంగా మార్చారు. వక్ఫ్ వ్యతిరేక నినాదాలతో దర్శి దద్దరిల్లింది. పార్టీలకు అతీతంగా వారి ఉనికి కోసం ముస్లింలు చేస్తున్న ఈ ర్యాలీ తో దర్శి గడియారం స్తంభం గడగడలాడిపోయింది. గంగవరం రోడ్డులోని మర్కస్ మస్జిద్ నుండి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్ లోని అక్సా మజీద్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు సోదరులు ప్లకార్డులతో నల్లజెండాలతో నల్ల రిబ్బన్లతో ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని దీనిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని శాంతియుతంగా నిరసన తెలుపుతూ 150 అడుగుల జాతీయ జెండాతో భారతదేశం జిందాబాద్ భారతీయులంతా ఒక్కటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ భారతదేశంపై తమకున్న ప్రేమను జాతీయ జెండాలతో ప్రదర్శించి నిరూపించుకున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింల ఆస్తులపై తీసుకువచ్చిన ఈ చట్టం ద్వారా తమ ధర్మ సంబంధమైన మస్జిదులు మదర్సాలు, తమ స్మశానాలు స్థలాలని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులను వ్యతిరేకించే ఈ చట్టం రద్దు చేసేంతవరకు
దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు.
Local Updates
23 Apr 2025 21:18 PM