

No.1 Short News
Newsreadఒక్క గంట లో తప్పిపోయిన ముగ్గురు పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం పోలీసులు
ఒంగోలు అన్నవరప్పాడు శ్రీ సూర్య విద్యానికేతన్ నందు 3వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ గేట్ నుండి వెళ్లిపోయి కనిపించలేదు. 1. షేక్ ఇస్మాయిల్ S/o అలీ ముర్తుజా, 09 సంవత్సరములు సంతపేట సాయిబాబా గుడి వద్ద, ఒంగోలు. 3rd Class. 2. కొంపల్లి సాల బిల్వనాధ్ S/o బుచ్చే శ్వరరావు, 10 సంవత్సరములు, 3rd Class, R/o ధారా వారి తోట ఒంగోలు. 3. అప్పాడిపాడు S/o నరసింహం, 09 సం, పల్లెపాలెం కొత్తపట్నం మండలం. 3rd Class.
పోలీస్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆదేశములతో ఒంగోలు టు టౌన్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, గంట వ్యవధిలోపలే తప్పిపోయి పిల్లలు అగ్రహారం రైల్వే గేటు వద్ద వారిని కనుగొని, సూర్య స్కూల్ వద్దకు తీసుకుని వచ్చి టూ టౌన్ ఇన్స్పెక్టర్ స్కూలు ప్రిన్సిపాల్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడమైనది. తప్పిపోయిన తమ పిల్లలను తిరిగి క్షేమంగా వారి వద్దకు చేర్చినందుకు పిల్లలు తల్లిదండ్రులు మరియు స్కూలు యాజమాన్యం ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
తప్పిపోయిన పిల్లలను కేవలం గంట వ్యవధిలోనే తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
Latest News
23 Apr 2025 22:37 PM