No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు బర్వేల్లి మానస
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన బర్వెల్లి దత్తు, అంజవ్వ గార్ల చిన్న కుమార్తె అయినటువంటి బర్వేల్లి మానస అనే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్కూరులో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 929 మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించి, నగదు బహుమతి ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
Latest News
27 Apr 2025 14:49 PM
2
30