

No.1 Short News
PRASANNA ADN NEWS TV75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు..
ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
Latest News
28 Apr 2025 16:33 PM