No.1 Short News

Newsread
డ్రగ్స్, మత్తుపదార్థాల నివారణ కు అవగాహనే మార్గం -తమీం అన్సారియా
మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గం: జిల్లా క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియా 👉యువత చెడు వ్యాసాలకు దూరంగా ఉండాలి...గంజాయి/ మాదకద్రవ్యాలను దరి చేరనియ్యరాదు:ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ 👉గంజాయిని రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వారి ఆధ్వర్యం లో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. డ్ర‌గ్స్ వినియోగంవ‌ల్ల క‌లిగే దుష్ప‌లితాల‌ను పెద్ద ఎత్తున‌ వివ‌రించ‌డ‌మే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి నియంత్ర‌ణ‌కు కట్టుదిట్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో డ్ర‌గ్స్‌ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌మని అందులో భాగంగా ప్ర‌తీ విద్యాసంస్థ‌లో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేయాల‌న్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటికి అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల్లో ఈగిల్ క్ల‌బ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఔష‌ద నియంత్రాణాధికారులు సంయుక్తంగా మందుల షాపుల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. డ్ర‌గ్స్ వినియోగం, ర‌వాణాపై నిఘాను పెంచి, అరిక‌ట్టేందుకు మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు. విద్యార్ధుల‌తోపాటుగా వివిధ వ‌ర్గాల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా జిల్లాలో డ్ర‌గ్స్ ర‌వాణాను పూర్తిస్థాయిలో అరిక‌ట్ట‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, జిల్లాలో మ‌త్తు ప‌దార్ధాలు, మాద‌క ద్ర‌వ్యాలను అరిక‌ట్ట‌డానికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జిల్లాలో ఎక్క‌డా గంజాయి పంట‌ సాగు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. జిల్లా మీదుగా ర‌వాణా జ‌రుగుతోంద‌ని, దీనిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. న‌మోదు చేసిన కేసుల సంఖ్య ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం కూడా శిక్షార్హమేనని, గంజాయి, డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి మైనింగ్ పనుల కొరకు ఇతర ప్రాంతాల నుండి కూలీలు జిల్లా కు వస్తుంటారని, సంబంధిత పరిశ్రమల యాజమాన్యం వారిని సమన్వయము చేసుకొని కూలీల పై నిఘా ఉండేలా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించి 283 మందిని గుర్తించడం జరిగిందన్నారు. ఒంగోలు లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, క‌ళాశాల‌ల్లో ఈగిల్ టీమ్‌లు, డ్రాప్ బాక్సుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌త్తుప‌దార్ధాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల స‌హ‌కారంతోనే పూర్తి స్థాయిలో డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్, మరియు డాబాలలో, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లలో బోర్డ్ లు.. మత్తు పదార్థాల నివారించే చర్యలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణ పై రూపొందించిన బ్రోచర్ల ను ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అమ్మకం ,రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా పోలీస్ డయల్ 100/112 తెలియజేయాలని, అట్టివారు వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అనంతరం ముఖ్యంగా పాఠశాలలు/కళాశాలలో విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలియచేయాలని,స్వీయ రక్షణ, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసలపట్ల మరియు చట్టాలపై, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు/మహిళలు/యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా అవగాహన కల్పించాలని, MEO, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలన్నారు. పిల్లలపై నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీస్ వారికి తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదీత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా ఏడుకొండలు, డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ లక్ష్మా నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
30 Apr 2025 21:53 PM
1
28