

No.1 Short News
Sk.Asma Reporter 9948680044హజ్ యాత్రికులకు హామీ ఇచ్చిన సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి - ఫారూఖ్ షుబ్లీ
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం యాత్రికుడికి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని త్వరితగతంగా అమలు చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మైనార్టీ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ వర్యులు పెద్దలు శ్రీ NMD ఫరూఖ్ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి వెళ్లిన హాజీలకు మాత్రమే లక్ష రూపాయలు చెల్లిస్తామని మేనిఫెస్టో నందు పొందపరచలేదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని గుర్తు చేశారు కాబట్టి హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి హాజీకి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Latest News
03 May 2025 20:24 PM