No.1 Short News

Newsread
మెగా డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారా లోకేష్ ఆదేశాలు జారీ
అమరావతి: జూన్ 6వతేదీ నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో 3గంటలకుపైగా సమీక్షించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
Breaking News
05 May 2025 23:52 PM
3
57