

No.1 Short News
Newsreadవలి బాష కుటుంబానికి న్యాయం, రక్షణ ఏర్పాటు చేయాలి - ఫారుక్ షుబ్లీ
ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నందు వలిబాష కుటుంబాన్ని MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ పరామర్శించి మేమున్నాము అన్న భరోసా కల్పించారు.
4-5-2025న తెల్లవారుజామున నమాజుకు బయలుదేరిన వలి భాష అని క్రూరాతి క్రూరంగా నరికి చంపి వేసిన ఘటన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది అన్న సంగతి అందరికి తెలిసిందే.
షేక్ రెహనా మృతుడు వలిబాష భార్యమణి, షేక్ రుక్సాన మృతుడి చిన్న కూతురు, షేక్ ఫర్జానా పెద్ద కుమార్తె, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 5 సం||ల క్రితమే అనిల్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడని అదే పని అతను చెప్పిన 5 సం||ల తరువాత చేసాడని భోరున వినిపించారు. ఇప్పుడు మమ్మల్ని సైతం చంపుతారని స్పష్టంగా బెదిరిస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పూర్తిగా అండగా ఉండాలని రక్షణ కల్పించాలని అలాగే ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కుటుంబానికి ఏది జరిగిన పూర్తిగా పోలీసులదే బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక సగటు తండ్రి ఆవేదన అర్థం చేసుకొని ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినాది కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని అదే విధంగా ఆ రోజు తెల్లవారి జామున వలి భాషా సందులో కరెంటు తీసివేయటంలో ఆంతర్యం ఏమిటి? ఈ హత్య వెనకాల అనిల్ ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే మృతుడి ఆత్మ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించటం జరిగింది.
అలాగే స్థానిక మంత్రి జనసేన నాయకులు కందుల దుర్గేష్ Kandula Durgesh గారు ఇప్పటి వరకు మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న గౌరవ రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు వారి కార్యాలయం నుండి మృతుడి కుటుంబానికి అందుబాటులోకి రావడం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేయడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News
07 May 2025 16:51 PM