

No.1 Short News
Sk.Asma Reporter 9948680044ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
Local Updates
07 May 2025 17:06 PM