

No.1 Short News
Sk.Asma Reporter 9948680044నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే
బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
Local Updates
08 May 2025 09:43 AM