

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మధుసూదన్ సతీమణి కామాక్షి, వారి ఇద్దరు పిల్లలను కలిసిన మంచు విష్ణు, దాడి జరిగిన తీరును గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. వారిని దత్తత తీసుకొని, వారి విద్యాభ్యాసం మరియు ఇతర అవసరాల కోసం నేను బాధ్యత వహిస్తాను అని విష్ణు హామీ ఇచ్చారు.
Latest News
09 May 2025 09:14 AM