

No.1 Short News
Newsreadదర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
Latest News
17 May 2025 11:23 AM