No.1 Short News

Umar Fharooq
జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం
శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య అధికారి మౌనిక తమ సిబ్బందితో కలిసి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వైద్య అధికారి మౌనిక మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసర ప్రాంతాల్లో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, నీటి తొట్టెల్లో వర్షపు నీటిని నిలువ చేయరాదని ఈ డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు పగలు మాత్రమే దాడి చేస్తాయని తెలియజేస్తూ, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు నిర్మూలనకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
Latest News
17 May 2025 15:11 PM
0
8