

No.1 Short News
Umar Fharooqజూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో శనివారం జూనియర్ ఎన్టీఆర్ 42 వ జన్మదినోత్సవం సందర్భంగా బీసీ కాలనీ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఒంగోలు వారి ద్వారా గ్రామానికి చెందిన 37 మంది యువతీ యువకుల నుండి రక్తం సేకరించి ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను రక్తదాతలకు అందించారు. ప్రమాద సమయంలో, ఆపద సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడేటటువంటి రక్తదానం గ్రామంలోని హిందూ, ముస్లిం యువతీ యువకులు పార్టీలకు, వర్గాలకు,మతాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల గ్రామానికి చెందిన పలువురు నిర్వాహకులను అభినందించారు.రక్తదాతలకు, అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూల్ డ్రింక్స్ , పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.
Latest News
17 May 2025 16:13 PM