No.1 Short News

Umar Fharooq
తాళ్లూరులో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి
తాళ్లూరులోని ఎంపీడీవో ఆఫీసులో టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ,టంగుటూరి ప్రకాశం పంతులు నెహ్రూ సమకాలికుడిగా, సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడిచిన మహనీయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం వాసి కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ,ధైర్యానికి ,సాహసానికి, జాతీయ భావానికి చిరునామా టంగుటూరి ప్రకాశం పంతులు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి ,మానం రమేష్ బాబు, శాగం కొండా రెడ్డి , ఐ శ్రీనివాసరెడ్డి రాచకొండ వెంకట్రావు,జనసేన నేత మారిశెట్టి హనుమంతు రావు పాల్గొన్నారు.
Latest News
21 May 2025 08:16 AM
0
6