

No.1 Short News
Umar Fharooqవర్షపు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
సాధారణంగా మే నెలలో రోహిణి కార్తిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కానీ దానికి భిన్నంగా వాతావరణంలో వచ్చిన అనుప్యమైన మార్పుల వలన ఈ నెలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షపు నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందేలా రైతులు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. అల్లూరు క్షేత్ర పర్యటనలో భాగంగా మే నెలలో 9,16,18,19, 20 తేదీలలో 84.1 మి.మి వర్షపాతం నమోదయింది ఇది ఎంతో ఆశాజనక పరిస్థితి కనుక, ఈ వర్షాలను ఉపయోగించుకొని రైతులు పచ్చి రొట్ట విత్తనాలు, జనువం ,జిలుగా ,పిల్లి పెసర, మినుము, పెసర, ఉలవలు ,అలసందలు, సోయాచిక్కుడు, చల్లి పశువులకు మేతగా వినియోగించుకుని 40 రోజుల తదుపరి భూమిలో బాగా కలియదున్నాలని ఎ ఓ తెలిపారు.
Latest News
22 May 2025 15:53 PM