No.1 Short News

Umar Fharooq
షర్మిల దీక్షకు మద్దతుగా కైపు వెంకటకృష్ణారెడ్డి
విశాఖ స్టీల్ కర్మాగారంలో కార్మికుల తొలగింపునకు నిరసనగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, విశాఖ స్టీల్ కర్మాగారంలో 2000 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుండి తొలగించడం సరికాదని, వారందరినీ వెంటనే విధులలోకి తీసుకోవాలని,తాను కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ దీక్షలో షర్మిలకు మద్దతుగా రాష్ట్ర అసంఘటిత కార్మికుల,ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది.
Latest News
22 May 2025 15:52 PM
0
4