No.1 Short News

Umar Fharooq
ప్రత్తిలో రసంపీల్చే పురుగులను నివారించాలి
వేసవిలో సాగు చేసిన ప్రత్తి ఎక్కువగా లక్కవరం దోసకాయలపాడు పరిధిలో ఉందని ,ఆ రైతులు సాగు చేసిన ప్రత్తి 30 నుండి 60 రోజుల వయసులో ఉందని, రసం పీల్చే పురుగులు ఆశించినట్టయితే తగు నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్ రావు తెలిపారు. లక్కవరం దోసకాయలపాడు క్షేత్ర పర్యటనలో భాగంగా ప్రత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి ఇమిడా క్లో ప్రడ్ 0.4 మి.లి లేదా ఏసీ ఫేట్ 1.5 గ్రా లీటరు నీటిని కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారి చేయాలని తెలిపారు. పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 25 చొప్పున అక్కడక్కడ అమర్చి తెల్ల దోమ లను గమనించి మందులు పిచికారి చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో వి ,ఎ ,ఎ A . భార్గవి, రైతులు పాల్గొన్నారు.
Latest News
24 May 2025 08:13 AM
0
5