

No.1 Short News
Newsread28 ఏళ్ల యువకుడికి పార్టీలో పరిచయమైన 40 ఏళ్ల వివాహిత.. ఆ తర్వాతే అసలు కథ
తనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వయసు 28 ఏళ్లు.. ఊరు విజయవాడ. ఉండేది మాత్రం హైదరాబాద్లో.. భాగ్యనగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల మధ్య గజిబిజీగా, ఉరుకుల పరుగుల జీవితం గడిపిన అతను..
కాస్త రిలాక్స్ అవుదామనుకున్నాడు. సొంతూరికి వెళ్లి స్నేహితుల మధ్యన ఛిల్ అవుదామని భావించాడు. కానీ ఆ నిర్ణయమే తనను చిక్కుల్లో పడేస్తుందని ఊహించలేకపోయాడు. ఓ పరిచయం తనను ఇరకాటంలో పడేస్తుందని.. ఓ వ్యక్తి తనను ఇబ్బందులకు గురిచేస్తారని అనుకోలేదు పాపం. హైదరాబాద్ నుంచి భుజాన బ్యాగ్ వేసుకుని విజయవాడకు బయల్దేరాడు. ఊరికి చేరిన తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో పాల్గొన్నాడు. ఆ పార్టీలో కలిసిన వ్యక్తి, అయిన పరిచయం.. తనను ఇబ్బందుల్లో పడేశాయ్. ఇక్కడ సీన్ కట్ చేస్తే..
ఆమె వయసు సుమారుగా 40 వరకూ ఉంటుంది.భర్త, పిల్లలు.. చక్కటి సంసారం, ఇబ్బందులు లేకుండా గడిచిపోతున్న జీవితం. కానీ మనిషి బుర్ర మా చెడ్డది కదా.. ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆమె కూడా అంతే. యవ్వనం దశ దాటేసింది.. సుమారుగా సగం జీవితాన్ని చూసేసింది. కానీ.. జీవితంలో ఏదో వెలితి అనుకుందో, లేదా లైఫ్ అంటే ప్రతిరోజూ పండగలా ఉండాలని భ్రమపడిందో.. బండి గాడి తప్పింది. రైల్వే ట్రాక్ మీద జెట్ స్పీడుతో వెళ్తున్న జీవితం ట్రాక్ తప్పింది. అలా ఆమె కూడా జీవితంలో కొత్త రుచులు కోరుకుంది. చక్కని సంసారాన్ని వదిలి.. స్థానికంగా ఉండే యువకులతో స్నేహం, పార్టీలు ఇలా.. అదిగో అప్పుడే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు.
వివాహిత నుంచి ఇబ్బంది కలిగించేలా మెసేజ్లు.. తరుచుగా ఫోన్లు.. మనోడికి విసుగొచ్చింది. ఆంటీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశాడు. అప్పుడే వివాహితలోని మరో కోణం వెలుగుచూసింది. తనతో సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోని యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు ఆంటీతో కలిగిన పరిచయం.. ఆ పరిచయం తెచ్చిన ఇబ్బందులు.. ఇలా వరుసగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో వివాహితను స్టేషన్కు పిలిపించారు పోలీసులు.. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఈసారికి సరిపోయిందని.. ఇంకోసారి ఫోన్, మెసేజులు చేసుకుంటున్నారని తెలిస్తే చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు. అలాగే ఓ పార్టీలో కలిసిన ఆంటీ.. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసింది.
Crime News
19 Jul 2025 06:32 AM