No.1 Short News

Newsread
శ్రీ గౌతమి లో ఫుడ్ పాయిజన్ కాలేదు తేల్చి చెప్పిన DMHO...
ఈనెల 26, 27 న దర్శి పట్టణం లోని అద్దంకి రోడ్ లో గల శ్రీ గౌతమి విద్యాసంస్థల లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల అనంతరం, మరుసటి రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులకు జ్వరం రాగా దర్శి లోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.. ఈలోపు ఫుడ్ పాయిజన్ జరిగిందని వార్తలు షికార్లు చేసాయి, ఈ క్రమంలో DMHO వారు క్యాంపస్ కి విచ్చేసి పరిసరాలను పరిశీలించారు, విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించగా ఇవి సాధారణ వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం వచ్చినదనీ, భయపడాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది. అలాగే ఈ కాలం లో వచ్చే వ్యాధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అర్బన్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News
29 Jan 2025 15:03 PM
2
45