

No.1 Short News
Newsreadవిమానం, హెలికాప్టర్ ఢీ.. నదిలో నుంచి 18 మృతదేహాల వెలికితీత
వాషింగ్టన్ లోని ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే క్రమంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ను ఢీ కొట్టింది. దీంతో గాల్లోనే రెండు ముక్కలైన విమానం పోటోమాక్ నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా నిట్టనిలువుగా నదిలో పడిందని అధికారులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.ఘటనలో నదిలో నుంచి 18 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా 64 మంది, ఆర్మీ హెలికాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారని చెప్పారు.
Breaking News
30 Jan 2025 12:38 PM