No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు.. మాకు కాదు: మంత్రి నారా లోకేశ్‌
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాన‌న్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్‌ సవాల్ విసిరారు.
Politics
25 Feb 2025 13:50 PM
0
28