

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నావ్... ఏమైంది జగన్: మంత్రి లోకేశ్ సెటైర్లు
ఈరోజు బడ్జెట్ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి శాసనమండలిలో ధన్యవాదాలు తెలిపే క్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై సెటైర్లు వేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ ఊదరగొట్టారని, చివరికి ఏమైందని ఎద్దేవా చేశారు.
ఇక గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని ముందే ఎలా చెబుతారంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దానికి మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ... రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి రూ. 13 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు.
Politics
25 Feb 2025 14:55 PM