

No.1 Short News
DR Local News - Chiralaఈపురుపాలెం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రభ వైభవం గా ఊరేగింపు జరిగినది
బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఈపూరుపాలెం గ్రామంలో ఈ రోజు రాత్రి బాల కోటేశ్వర స్వామి వారి భక్త బృందం సీతారాంపేట, ఈపూరుపాలెం గ్రామం వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా అతి వైభవంగా *ప్రభ* ఊరేగింపు జరిగినది. ఈ ఊరేగింపులో మహిళామ తల్లుల హారతుల సేవ, కోలాట ప్రదర్శ న అత్యద్భుతముగా జరిగినది.
ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజక్ బండారు జ్వాలా నరసింహo *సత్సంగం* చేయుచూ 400 సంవత్సరాల క్రితం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా ప్రభల ఊరేగింపు జరిగినదని, అలాగే భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లుటకు ప్రధానంగా మహిళామ తల్లులే కారణమని కాబట్టి ఇటువంటి ఊరేగింపులు, హారతుల సేవలు, కోలాట ప్రదర్శనలు, భజనలు..... హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యతకు ఏర్పాటు చేసినవని కావున కుల మతాలకతీతంగా సనాతన ధర్మ ఐక్యత కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని తద్వారా మన భరతభూమిని విశ్వ గురు స్థానంలో నిలపాల్సిన బాధ్యత మనందరిదని మాట్లాడుట జరిగినది.
ఈ ఊరేగింపులో మహిళామ తల్లులు, బాలబాలికలు, గ్రామ ప్రజలు, కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
భవదీయ
బండారు జ్వాలా నరసింహo
జిల్లా సహ సంయోజక్
హిందూ చైతన్య వేదిక. చీరాల
బాపట్ల జిల్లా
Local Updates
27 Feb 2025 07:57 AM