

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ క్రిప్టో కరెన్సీ స్కామ్ లో టాలీవుడ్ హీరోయిన్స్
క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో టాలీవుడ్ హీరోయిన్స్
పుదుచ్చేరి ఫిబ్రవరి 28,2025: తమిళనాడు పుదుచ్చేరి లోని క్రిప్టోకరెన్సీ స్కామ్ లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 60 కోట్ల స్కామ్ జరిగినట్టు నిందితుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన వివాదంగా మారింది. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసిన సంఘటనకు సంబంధించి, పుదుచ్చేరి సైబర్ క్రైం పోలీసుల విచారణలో తమన్నా, కాజల్ అగర్వాల్‌లను కూడా విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లు నిందితులు వెల్లడించారు. ఇప్పటికే, పుదుచ్చేరి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఆశోకన్ ఫిర్యాదు మేరకు, నిందితులు నీతీష్ జైన్, అరవింద్ కూమార్ అరెస్టయ్యారు. వారు చెప్పిన ప్రకారం, 2022లో కోయంబత్తూరులో జరిగిన క్రిప్టోకరెన్సీ లాంచింగ్ ఈవెంట్‌లో తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో వీరు ప్రమోట్ చేసిన క్రిప్టోకరెన్సీ, స్కామ్‌లో భాగమై ఉండవచ్చుననే అనుమానాలు పెరిగాయి.
Crime News
28 Feb 2025 10:31 AM