No.1 Short News

DR Local News - Chirala
సైన్స్ తోనే సమాజ అభివృద్ధి
చీరాల : ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోనే విదంగా కృషి చేస్తామని చీరాల ఆర్కే ఓరియన్టల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అనీల్ కుమార్ అన్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల చేత ప్రాజెక్టులను తయారు చేయించటం అభినందనీయ మన్నారు. అనంతరం కదలికలు దాని పనితీరు అనే అంశంపై ఆరవతగతి విద్యార్థిని పట్టెం షారోన్ గ్లోరియ చక్కగా వివరించారు. రామన్ ఎఫెక్టును కనుగొన్న సర్ సివి రమన్ పుట్టినరోజు ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొనడం జరుగుతున్నదని షారోన్ గ్లోరియస్ తెలిపారు. అనంతరం ప్రాజెక్టులను తయారు చేయడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సైన్స్ ఉపాధ్యాయని టి జీవన జ్యోతి, ప్రియాంకా, రజనీ, రాణీ, బషీర్ పాల్గొన్నారు.
Education
01 Mar 2025 15:58 PM
0
33