

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంభారతదేశ మొదటి ముస్లిం మహిళా మంత్రి మాసుమా బేగం వర్ధంతి వేడుకలు
ప్రపంచ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తాళ్ళూరు మండలం తూర్పు గంగవరంలో దరిశి రోడ్డునందుగల స్థానిక మజీద్ కు సమీపంలో వున్న HP పెట్రోల్ బంకు ఆవరణలో, ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసం ఆరంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(సమైక్యాంధ్రప్రదేశ్) మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసి,భారత దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రిగా పనిచేసి, భారత దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిన మసూమా భేగం వర్ధంతి సందర్భంగా, IRCS(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈమె చిత్రపటానికి పూలమాల వేసి,పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు.ఈమె తొలి మహిళా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలవారికి ఎనలేని సేవలందించారని ఈమె చేసిన సేవలను కొనియాడారు.ఈ మె 1952లో,1957లో రెండుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికై, ఒకసారి శాసనసభ ఫ్లోర్ లీడరుగాను,ఇంకోసారి మంత్రిగానూ సేవలందించారని తెలిపారు.ఈమె ప్రముఖ సంఘసేవకురాలు సరోజినీనాయుడు శిష్యురాలిగా వుండి మంచి సంఘసేవకురాలిగా పేరుప్రఖ్యాతులు గఢించారని కపురం శ్రీనివాసరెడ్డి ఈమె సేవాతత్పరతను గురించి సవివరంగా వివరించారు. ఈ కార్య క్రమానికి ముస్లిం సంధానీ,మీరావలి, సైదా, వలి,అశోక్ బాబు,చిన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
Local Updates
03 Mar 2025 10:19 AM