No.1 Short News

Newsread
మార్కాపురం: ప్లాస్టిక్ వాడకం ఆపాలి: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి
ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఒకసారి వాడి పడేసే ఈ ప్లాస్టిక్ వాడరాదని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వలన అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. దీనిపై అవగాహన చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వెస్తుందని తెలియజేశారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
Local Updates
15 Mar 2025 12:47 PM
1
19