

No.1 Short News
Newsreadప్రజా చైతన్యంతో నే పరిశుభ్రత సాధ్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజా భాగస్వామ్యంతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడవద్దు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగ్ లు వాడాలి అంటూ అవగాహన అవగాహన ర్యాలీలో కల్పించారు. పట్టణం లోని దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దంటూ దుకాణదారులకు అవగాహన కల్పించా రు. డా|| గొట్టిపాటి లక్ష్మీ పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల MRO శ్రవణ్ కుమార్, దర్శి మునిసిపల్ కమిషన్ మహేష్, అధికారులు, కూటమి శ్రేణులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. పట్టణంలోని పౌరులందరూ రాజకీయాలకతీతంగా, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువత మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు
Local Updates
15 Mar 2025 13:02 PM