No.1 Short News

Newsread
ఒంగోలు జి.జి.హెచ్ లో కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మిక పరిశీలన...
అది... జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రి. శనివారం రాత్రి సుమారు 10:30 గంటలకు ఒక కారు ఈ ఆసుపత్రిలోకి వచ్చింది. కారు దిగిన ఒక మహిళ నేరుగా క్యాజువాలిటి వార్డులోకి వెళ్లారు. చికిత్స పొందటానికి కాదు.... అక్కడ ఉన్న వారికి చికిత్స అందుతున్న తీరును పరిశీలించడానికి వెళ్లిన ఆ మహిళను చూసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు ! కారణం... వచ్చినది సాధారణ మహిళ కాదు !.. జిల్లా కలెక్టర్ !!. ఔను.... ఒంగోలు జి.జి.హెచ్. (రిమ్స్) లో వైద్య సేవలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా ఈ ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటీతో పాటు గైనిక్ వార్డు, రేడియాలజీ సెక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. క్యాజువాలిటీ వార్డులో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన సీనియర్ వైద్యులు ఆ సమయంలో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరును, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎక్స్ రే, సిటీ , ఎంఆర్ఐ స్కాన్ కోసం వచ్చిన వారికి ఎప్పుడు చేస్తున్నారు, ఎప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు, తదితర వివరాలను కూడా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. స్కానింగ్ చేయడంలో రోగులను ఇబ్బంది పెట్టేలా జాప్యం చేస్తే సహించబోనని ఆమె హెచ్చరించారు. సుమారు 11:45 గంటల వరకు ఆసుపత్రిలో గడిపిన కలెక్టర్... పలువురు రోగులతోనూ, వారి బంధువులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. పారిశుద్ధ్యం సరిగా లేదని పలువురు చెప్పగా కలెక్టర్ కూడా స్వయంగా చూశారు. పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్యులను, సిబ్బందిని హెచ్చరించారు.
Breaking News
16 Mar 2025 06:00 AM
4
59