No.1 Short News

Newsread
దర్శి: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కడియాల లలిత్ సాగర్
రంజాన్ సందర్భంగా కురిచేడు రోడ్డులోని ఈద్గా మైదానం వద్ద శనివారం జరిగిన నవాజ్ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొని మాట్లాడారు. మైనార్టీల అభివృద్దే ద్వేయంగా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారని మైనార్టీల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అడిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు డాక్టర్ కడియాల లలిత్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వపరంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈద్గా అభివృద్ధికి అవసరమైన ప్లాట్ ఫామ్ నిర్మాణానికి వ్యక్తిగతంగా 2 లక్షల విరాళంగా ప్రకటించారు గతంలో కూడా మసీదు అభివృద్ధికి ముస్లిం సోదరులు కోరిక మేరకు 7,86,000 ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా షాదీ ఖానా ఏర్పాటు మసీదును పూర్తి చేయడం ఈద్గా అభివృద్ధి తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వపరంగా నగర పాలక పంచాయతి నుండి నిధులు మంజూరు చేపిస్తానని డాక్టర్ లలిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మైనార్టీలకు తగిన గుర్తింపుని ఇచ్చి ఆదరిస్తామని నామినేట్ పోస్టులు భర్తీలో కూడా వారికి ప్రాధాన్యతనిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హామీ ఇచ్చారు. ప్రకటించిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని అక్కడికక్కడే ముస్లిం పెద్దలకు అందజేసారు. రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం నమాజ్ కార్యక్రమం లో పాల్గొన్న శుభ సందర్బంగా ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు అందరు డాక్టర్ కడియాల లలిత సాగర్ ని సత్కరించారు. డా|| లలిత్ రంజాన్ పండుగ సందర్బంగా ఈద్గా మైదానం లో ముస్లిం పెద్దలను సత్కారించి నూతన వస్త్రాలు అందజేశారు.
Latest News
31 Mar 2025 12:37 PM
1
33