

No.1 Short News
Reporter Suhelకడియాల వారి తేనీటి విందును స్వీకరించిన నందమూరి
స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నటుడు కళ్యాణ్ రామ్ నరసరావుపేటలోని టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గృహాన్ని సందర్శించారు. వీరి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో కళ్యాణ్ రామ్, వారు ఇచ్చిన తేనేటి విందును స్వీకరించారు. రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరావు, కడియాల రమేష్, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , మర్యాద పూర్వకంగా మాట్లాడుకున్నారు. నరసరావుపేటకు చెందిన పలువురు వైద్యులు, నందమూరి కడియాల అభిమానులు కళ్యాణ్ రామ్ తో ఫోటోలు దిగారు. అనంతరం కరతాళ ధ్వనులతో సందడి చేస్తున్న వేలాది మంది అభిమానులకు ఆయన అభివాదం చేశారు.
Local Updates
31 Mar 2025 21:09 PM