

No.1 Short News
Newsreadఅనుకోని అతిథిలా షెహన్ షా ఇంటికి మంత్రి లోకేష్
షెహన్ షా మంగళగిరి పట్టణంలో ఒక సాధారణ మైనారిటీ కార్యకర్త. పసుపు జెండానే ఆయనకు సర్వస్వం. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇస్తున్న మంత్రి లోకేష్ కార్యక్రమం ఎక్కడుంటే అక్కడకు వెళ్లి, ఉడత భక్తిగా తాను చేయదగిన సేవ చేస్తూ ఉంటారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన పని తాను చేసుకు పోతుంటాడు. రంజాన్ మాసం సందర్భంగా మంత్రి లోకేష్ తన ఇంటికి వస్తారని ఆయన ఊహించలేదు. అనుకోని అతిధిలా లోకేష్ వారి ఇంటికి వెల్లే సరికి షెహన్ షాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు నోట మాట రాలేదు. వాస్తవానికి షహేన్షా ఇంటిలో ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. అప్పటికప్పుడు తమ ఇంటిలో ఉన్న దుప్పట్లతో కవర్ చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం షెహన్ షా కుటుంబ సభ్యులు ప్రేమతో పెట్టిన పండ్లు పలహారాన్ని స్వీకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రేమ, ఆప్యాయత తప్ప ఎటువంటి హంగు ఆర్భాటాలు లేవు. మీడియాకు సైతం లోకేష్ వారి ఇంటికి వెళ్తున్న సమాచారం లేదు. షెహన్ షా కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. శ్రీకృష్ణుడు కుచేలుడు ఇంటికి వెళ్లిన చందంగా ఒక సాధారణ కార్యకర్త ఇంటికి వెళ్లి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. కార్యకర్తకు లోకేష్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలదా?
Latest News
01 Apr 2025 06:16 AM