No.1 Short News

Newsread
దర్శి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తో చర్చించిన గొట్టిపాటి లక్ష్మీ, సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు
ఈరోజు బాపట్ల జిల్లా, చినగంజాం మండలం, గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మరియు ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర విధ్యుత్ శాఖా మాత్యులు గొట్టిపాటి రవికుమార్ తో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఈసందర్బంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్లో భాగంగా అన్న కాంటీన్ ఏర్పాటు, రోడ్లు విస్తరణ పనులు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడం తదితర పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా దొనకొండలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం పట్ల లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
Latest News
01 Apr 2025 18:55 PM
7
40