No.1 Short News

Newsread
దర్శి: అన్నా క్యాంటీన్ కు నిధులు మంజూరు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం లోని దివాకరపల్లిలో బుధవారం సి బి జి ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఐటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ తో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్శిలో అన్నా క్యాంటీన్ కు 61 లక్షలు నిధులు మంజూరు చేస్తూ నగర కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడం పట్ల డాక్టర్ లక్ష్మి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దర్శి లో అన్నా క్యాంటీన్ కోసం డాక్టర్ లక్ష్మి అనేకసార్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు , మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ తో అనేక సార్లు కలిసి కోరడం జరిగింది. ఈ మేరకు అన్న క్యాంటీన్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయడం ఆమె కు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా దర్శి నియోజకవర్గం కురిచేడు ప్రాంతంలో సిపిజి ప్లాంట్ ను కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి నారా లోకేష్ ని, విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ ని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. వెనుకబడిన దర్శి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆమె వివరించారు. అదేవిధంగా డిగ్రీ కాలేజీ కి అవసరమైన శాశ్వత భవనాల ను నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని లోకేష్ గారిని కోరడం ఆయన దానిపై కూడా సానుకూల త వ్యక్తం చేసినట్లు ఆమె వివరించారు. ఇలా మన కూటమి ప్రభుత్వంలో 10 నెలల్లో ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంగా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చేందుకు మన పెద్దలు లోకేష్ గారు ఇస్తున్న సంపూర్ణ సహకారానికి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు డోల బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ నియోజకవర్గాలు ఇన్చార్జులు, కార్పొరేషన్ చైర్మన్ లు, జిల్లా పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Latest News
02 Apr 2025 15:21 PM
10
35

Newsread
For better experience and daily news update.
Download our app from play store.