No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
ముండ్లమూరులో పేకాట రాయులు అరెస్ట్
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ముండ్లమూరు పోలీసులు గురువారం ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.3వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. గ్రామాలలో ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
Local Updates
04 Apr 2025 11:23 AM
0
20