No.1 Short News

Umar Fharooq
నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్
బాపట్ల, జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు.ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లాఅటవీ శాఖ అధికారి భీమా నాయక్, ఎక్సైజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
05 Apr 2025 18:18 PM
0
22