

No.1 Short News
Umar Fharooqసోమవరప్పాడు లో వానర మూకల స్వైరవిహారం భయాందోళనలో ప్రజలు
తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం కు చెందిన సోమవరప్పాడు లో గత కొంతకాలంగా విపరీతంగా కోతులు సంచరిస్తూ ఇండ్లలోకి చొరబడుతున్నాయి. ఈ 8వ తేదీ అనగా మంగళవారం సోమవరప్పాడు లోని ముగ్గురు వ్యక్తులపై ఈ కోతులు దాడి చేయడం జరిగింది, మసీదు వీధిలోని రెండు సంవత్సరాల చిన్నారిపై కూడా ఇంటిలోకి చొరబడి పొట్టపై కొరకడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంతో చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లడానికి వీధిలోకి రావడానికి కూడా భయపడుతున్నారు, దీంతో అక్కడ ప్రజలు భయంతో ఆందోళన వ్యక్తం చేస్తు దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Latest News
09 Apr 2025 08:28 AM