తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని మర్కస్ మసీద్ పరిధిలో ముస్లిం సోదరులు మంగళవారం ప్రచారం చేశారు. ముస్లిం సోదరులందరూ ఏకం కావాలని, వక్స్ చట్ట సవరణకు నిరసనగా దర్శిలో బుధవారం నిర్వహించే ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఫజల్, అబ్దుల్ కరీం, మదర్ వలి, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.