ఆదోని పట్టణంలోని ఇంద్రనగర్ ఎరుకల కాలనీలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుడైన 8 ఏళ్ల బాలుడు అభిరామ్ విషపూరిత పాము కాటుతో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుండి వచ్చి ఇంట్లో భోజనం చేస్తుండగా ఏదో కాటేసినట్లు అనిపించడంతో తల్లికి తెలియజేశాడు. వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అభిరామ్‌ను ఆదోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
వైద్యులు పరీక్షించి అభిరామ్ ఇప్పటికే మృతి చెంది ఉన్నట్లు నిర్ధారించారు. డ్యూటీ డాక్టర్ సమాచారం అందజేయడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బాలుడి పెద్దనాన్న మీడియాతో మాట్లాడుతూ,ఇంద్రనగర్ కాలనీలో కాలువలు, మురుగునీటి డ్రెయిన్లు అపరిశుభ్రంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణం.ఎమ్మెల్యే అధికారులు, వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలి. మా కుటుంబానికి జరిగిన విషాదం మరెవరినీ తాకకూడదని కోరుకుంటున్నాం అని వివరించారు.