మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది డాక్టర్:గొట్టిపాటి లక్ష్మీ
దర్శి మండలం, తూర్పు వీరయపాలెం ప్రభుత్వ పాఠశాలలో గురువారం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మొక్కలు నాటారు. చంద్రన్న - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ లక్ష్మి మొక్కలను నాటి మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఇంట్లో మొక్క నాటుకొని భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన సమాజం అందించాలని పిలుపునిచ్చారు. పచ్చదనం ద్వారా పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత ద్వారా మన ఆరోగ్యం మనమే పరిరక్షించుకోవచ్చని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమం లో ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, పరిటాల సురేష్, గుర్రం బాలకృష్ణ, తూర్పు వీరయపాలెం గ్రామ ప్రజలు ఉన్నారు.