పెట్టుబడుల పేరుతో విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల పెట్టుబడికి రూ.6 వేల వడ్డీ చెల్లిస్తామని మోహిత్ ట్రేడింగ్ కంపెనీ పలువురిని ఆశ పెట్టి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. మొత్తం 1200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సంస్థ ఎండీ వెంకట్ ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు.