No.1 Short News

Newsread
Bank of Maharashtra Recruitment 2025: నెలకు రూ. 1.5 లక్షల వరకు సంపాదించే అవకాశం!
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారుల కోసం ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన చేసింది. 2025-26 సంవత్సరానికి గాను ‘ఇంటర్నల్ ఓంబుడ్స్‌మన్(Internal Ombudsman)’ పోస్టును అగ్రిమెంట్ బేసిస్ లో భర్తీ చేయనుంది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి మంచి జీతంతో పాటు ఇతర భత్యాలు కూడా అందించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం: ఇతర బ్యాంకులలో లేదా ఆర్థిక నియంత్రణ సంస్థలలో జనరల్ మేనేజర్ (GM) స్థాయిలో పనిచేసి రిటైర్ అయినవారు మాత్రమే అర్హులు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్, రూల్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ వంటి రంగాలలో కనీసం 7 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్య గమనిక: అభ్యర్థులు గతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పనిచేసి ఉండకూడదు. వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,00,000 జీతం ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం రూ.20,000, టెలిఫోన్ బిల్లు రూ. 5,000, ఇంటి అద్దె కోసం రూ.25,000 (లేదా బ్యాంక్ క్వార్టర్స్ సౌకర్యం) ఇస్తారు. ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది అభ్యర్థిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bankofmaharashtra.in/current-openings ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 03.జులై.2025 దరఖాస్తు రుసుము: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,180 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కావలసిన దృవపత్రాలు: విద్యార్హత సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
Jobs
30 Jun 2025 13:49 PM
0
34






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (658)
  • Motivation (10)
  • Crime News (19)
  • Local Ads (33)
  • Entertainment (14)
  • Local Updates (185)
  • Sports News (12)
  • Education (8)
  • Business Promotions (1)
  • Politics (63)
  • Breaking News (92)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.