No.1 Short News

Newsread
పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం..
న్యూ ఢిల్లీ : సాధారణంగా ఎవరైనా నేరం చేస్తే వాళ్లని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది. ఆ డబ్బులు చెల్లిస్తేనే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలామంది పేద ఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు. దీంతో వాళ్లు బెయిల్‌ మంజూరైనప్పటికీ జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు ఇటీవల హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది.అలాగే రిమాండ్‌తో పాటు శిక్షపడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం రూ.40 వేల లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్‌కు సెంట్రల్‌ నోడల్ ఏజెన్సీ (CNA)గా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. దీంతో CNA అంత మొత్తం విడుదల చేస్తుంది. ఒకవేళ జరిమానా రూ.40 వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి CNAకు రాస్తుంది. దీంతో ఆ మొత్తాన్ని సీఎన్‌ఏ విడుదల చేస్తుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ కింద అర్హులైన ఖైదీల జాబితాను రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్స్, మనీ ల్యాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్టయిన వాళ్లకి ఈ పథకం వర్తించదు.
30 Jun 2025 14:55 PM
0
66






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (658)
  • Motivation (10)
  • Crime News (19)
  • Local Ads (33)
  • Entertainment (14)
  • Local Updates (185)
  • Sports News (12)
  • Education (8)
  • Business Promotions (1)
  • Politics (63)
  • Breaking News (92)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.