విశాఖపట్నం కేజీహెచ్లో ఒక మహిళ మృతి
ఏపీలో జీబీస్ వైరస్ కారణంగా విశాఖపట్నం ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళలు మరణించడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే 14 మందే చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా వెంటనే వైద్యం అందకపోతే ఒళ్లంతా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.