తాళ్లూరు మండలం లో కొర్రపాటి వారి పాలెం గ్రామం లో TDP వార్డ్ మెంబర్ రాజీనామా
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొర్రపటివారిపాలెం పంచాయితీ కి చెందిన TDP 1 వార్డు మెంబర్ వెంకట్రావు వార్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తాళ్ళూరు మండల ఎంపీడీవో కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గ్రామ సర్పంచ్, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామం లో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోతున్నామని, తమకు ప్రాధాన్యత లేనందువల్ల, ప్రజలకు న్యాయం చేయలేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.