దర్శి లో ముగ్గులపోటీల్లో డ్రోన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో సంక్రాతి - సంబరాలు లో బాగంగా ఈరోజు దర్శి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మహిళలకు ఆటల పోటీలకు సంబందించిన డ్రోన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
పార్టీ కార్యకర్త మృతి పట్ల నివాళులు అర్పించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం దోసకాయల పాడు గ్రామములో పార్టీ కార్యకర్త Y జనార్ధన్ రెడ్డి తండ్రి మృతి చెందగా ఆర్పిస్తున్న ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి ఎంఎల్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యకర్త ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు.
హైదరాబాద్-విజయవాడ హైవే పై సంక్రాంతి సందడి
టోల్ ప్లాజా వద్ద
కిలో మీటర్ల మేర భారీగా స్తంభించిన ట్రాఫిక్
Latest News
13 Jan 2025 22:34 PM
3
0
1
34
newsread.in
Asma
నారావారి పల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
నారావారిపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించిన సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు.
దర్శి లో గొట్టిపాటి లక్ష్మీ రాకతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
దర్శి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం లో దర్శి నియోజకర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మహిళలకు ఆటల పోటీలు ప్రారంభించారు.
ఈ సంక్రాంతి సంబరాలకు గొట్టిపాటి లక్ష్మీ రావడం తో ఉత్సవ భరిత వాతావరణంలో ఉల్లాసవంతంగా పెద్ద ఎత్తున దర్శి లో మహిళలతో సంక్రాంతి శోభ సంతరించుకున్నది.
శ్రీ గౌతమి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు అందరు ఆహ్వానితులే
25 సంవత్సరలలో విద్యారంగంలో విశిష్ట సేవలందించిన శ్రీ గౌతమి విద్యాసంస్థ చైర్మన్ గా లక్షలాదిమంది విద్యార్థిని విద్యార్థుల తో మమేకమై సాగుతున్న ప్రయాణంలో అందరినీ ఒకేసారి ఒకే వేదికపై తీసుకురావాలి యోగక్షేమాలు తెలుసుకోవాలి అనే అభిలాశతో అద్దంకి రోడ్డు లో గల గౌతమి వారి సంస్కృతి విద్యాలయంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జనవరి *26 , 27 వతేది లో* అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది అని చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి తెలిపారు.
భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ.
ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ సంక్రాంతి ప్రతి ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సిరిసంపదలతో భోగి భాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ బంధు మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కడియాల లలిత సాగర్ గారి ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో గోకులం షెడ్ ని ప్రారంభించిన ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది అని తెలియపరచడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా దర్శి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత శ్రీమతిగొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాల కు శ్రీకారం చుట్టడం జరిగింది పల్లెపండగ కార్యక్రమం కానీ.. గ్రామాల్లో సిసి రోడ్లు వేయటం అలాగే గోకులం షెడ్ లు నిర్మించడం . అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం గ్రామంలో మారెళ్ళ నారాయణమ్మ నిర్మించిన గోకులం షెడ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది..... ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మరి గ్రామ సర్పంచ్ కర్నా సుబ్బులు స్థానిక నేతలు పాల్గొన్నారు
అసిస్ట్ ఫౌండేషన్ 50 వసంతాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
Assist ఫౌండేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ 50 సంవత్సరాలు తిరుగులేని అంకితభావంతో మీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం, అని వారిని కొనియాడారు.