Select Location
Newsread Image

No.1 Short News

Umar Fharooq
బొద్దికూరపాడు లో స్వయం ఉపాధి శిక్షణ
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో పాత బ్యాంకు ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్ సెట్ ) ఒంగోలు వారి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న 35 మంది మహిళల టైలరింగ్ శిక్షణ కార్యక్రమం టైలరింగ్ ఫ్యాకల్టీ కె అరుణ, బాపూజీ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు థియరీ , ప్రాక్టికల్స్ విధానంలో టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.ఈ శిక్షణ కార్యక్రమం రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, లీలా కృష్ణ, సుధీర్ పర్యవేక్షణలో జరుగుతుంది.
View More
Latest News
18 May 2025 15:44 PM
0
1
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జూనియర్ ఎన్ టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో శనివారం జూనియర్ ఎన్టీఆర్ 42 వ జన్మదినోత్సవం సందర్భంగా బీసీ కాలనీ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఒంగోలు వారి ద్వారా గ్రామానికి చెందిన 37 మంది యువతీ యువకుల నుండి రక్తం సేకరించి ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లను రక్తదాతలకు అందించారు. ప్రమాద సమయంలో, ఆపద సమయంలో ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడేటటువంటి రక్తదానం గ్రామంలోని హిందూ, ముస్లిం యువతీ యువకులు పార్టీలకు, వర్గాలకు,మతాలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించడం పట్ల గ్రామానికి చెందిన పలువురు నిర్వాహకులను అభినందించారు.రక్తదాతలకు, అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూల్ డ్రింక్స్ , పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు.
View More
Latest News
17 May 2025 16:13 PM
0
10
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమం
శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గంగవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య అధికారి మౌనిక తమ సిబ్బందితో కలిసి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వైద్య అధికారి మౌనిక మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నిర్మూలనకు అందరూ కృషి చేయాలని,పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసర ప్రాంతాల్లో తాగి పడేసిన కొబ్బరి బోండాలు, నీటి తొట్టెల్లో వర్షపు నీటిని నిలువ చేయరాదని ఈ డెంగ్యూ జ్వరం దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు పగలు మాత్రమే దాడి చేస్తాయని తెలియజేస్తూ, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు నిర్మూలనకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
View More
Latest News
17 May 2025 15:11 PM
0
8
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Breaking News
17 May 2025 11:26 AM
1
10
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తిరంగా ర్యాలీ లో గొట్టిపాటి లక్ష్మీ, కడియాల లలిత్ సాగర్
ఆపరేషన్ సింధూర్ తో భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దర్శి టౌన్ లో జరిగిన తిరంగా ర్యాలీలో డా||గొట్టిపాటి లక్ష్మీ, డా||కడియాల లలిత్ సాగర్ లు పాల్గొన్నారు. దర్శి లోని కురిచేడు రోడ్ నుండి దర్శి గడియారం స్తంభం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొని వందేమాతరం నినాదాలతో భారత సైన్యంపై తమకున్న ప్రేమాభిమానాలను చాటారు. ర్యాలీలో భాగంగా అమరులైన జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికులను సన్మానించడం జరిగింది.
View More
Latest News
17 May 2025 11:23 AM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
వైద్య అధికారులు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో ప్రత్యేక దృష్టి సారించాలి
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి నాగులుప్పలపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ట్రాకింగ్, ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, రోగుల రిజిస్ట్రేషన్ రూము రికార్డ్స్ ను, క్యాజువాలిటి రూములను, అత్యవసర సేవా విభాగంను, ల్యాబ్ లను పరిశీలించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులతో మాట్లాడడం జరిగింది.
View More
Latest News
16 May 2025 12:29 PM
0
6
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పిచ్చికుక్క స్వైర విహారం
తాళ్లూరు మండలంలోని మాధవరం గ్రామంలో పిచ్చికుక్క సైర విహారం చేసింది. గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలను కరిచి గాయపరిచింది. సాయి అనే బాలుడిని ఇష్టాను రీతిగా కరవడంతో తలపై గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. శ్రీ లక్ష్మీ అనే బాలికను కూడా చేతిపై కరచి గాయపరిచింది. గాయపడిన సాయి,శ్రీలక్ష్మీ లను తాళ్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు తరలించగా వెంటనే పదమ చికిత్స అందించారు.డాక్టర్ సలహా మేరకు సాయి అనే బాలుడిని ఒంగోలు రిమ్స్ కు తరలించడం జరిగింది.
View More
Latest News
16 May 2025 12:03 PM
0
4
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మంత్రి లోకేష్ ను కలిసిన రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వేణుబాబు
నాగులప్పలపాడు మండలం లోని అమ్మనబ్రోలు లో దారుణ హత్య గురైన నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ను చదలవాడ లోని హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు కలిసి పలు విషయాల గురించి మాట్లాడడం జరిగింది.
View More
Latest News
15 May 2025 22:32 PM
0
6
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
బీజేపీ పార్టీ లో చేరిన జకియా ఖానం కి ఘన స్వాగతం
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్ గారు Bharatiya Janata Party (BJP) లో చేరారు. పార్టీ రాష్ట్ర​అధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారితో కలిసి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీమతి జకియా ఖానమ్ గారు.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీజేపీలో చేరారు. ముస్లిం సమాజం అభ్యన్నతికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం వక్ఫ్ (సవరణ) చట్టం తేవడం, ముస్లిం మహిళలకు గుదిబండగా మారిన ట్రిపుల్ తలాక్​ నిషేధించడమే కాక పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ని నాదంతో సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా అందిస్తున్నారు.
View More
Latest News
15 May 2025 17:10 PM
1
11
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ప్రమాదానికి గురి అయిన తాళ్లూరు టు ఒంగోలు ఆర్టీసీ బస్సు
మే 14 2025 ఒంగోలు నుండి తాళ్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివరామపురం, గాడి పత్తి వారి పాలెం మధ్యలో గల టర్నింగ్ వద్ద తాళ్లూరు నుండి వెల్లంపల్లి వైపు లోడుతో వెళ్తున్న లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు ఒక వైపున నాలుగు కిటికీలు, రైలింగ్, బాడీ ధ్వంసం కాగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కిటికీ వైపు ప్రయాణికులు ఎవరు కూర్చోకపోవడం వలన బస్సు డ్రైవరు కండక్టర్ తో సహా ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.
View More
Latest News
15 May 2025 14:22 PM
0
8
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఏపీ లో మెట్రో ప్రాజెక్టులపై కీలక ముందడుగు
అమరావతి : ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడింది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.5,900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోవిదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చించనున్నారు.
View More
Latest News
14 May 2025 20:08 PM
1
8
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి నోటిదూల
మన సైనిక ఆది కారిణి కర్నల్ సోఫియా ఖురేషి పై తప్పుడు కూతలు ( ఉగ్రవాదుల మతానికి చెందిన ) అని వాగిన మంత్రి విజయ్ షా కు బిజెపి అధిష్టానం పిలిచి చివాట్లు పెట్టింది, బిజెపి సానుభూతిపరులు తరచూ ఇతర మతాల పై నోరు జారడం పరిపాటి అయ్యింది,కానీ యుద్ధ సమయం లో ఇలాటి దిగజారుడు మాటల వల్ల మన దేశ ప్రతిష్ట ప్రపంచం లో మంట గలిసిపోతుంది,ఇకనైనా బీజేపీ వారు నోటికి తాళం వేసుకొని ఉంటే మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు లేదా అంతర్జాతీయం గా భారత్ చెడ్డ పేరు మూటగట్టుకోవడం ఎంతో దూరం లో లేదు.
View More
Latest News
14 May 2025 08:12 AM
1
7
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జిమ్స్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు
జనతా మెడికల్ ఇన్స్టిట్యూట్ (జిమ్స్ ) ఆధ్వర్యంలో ఎబీసీ హైస్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ వైద్య శిబిరం ను ప్రారంభించగా. కంటి వైద్య నిపుణులు పూజిత మాదాల ఆధ్వర్యంలో డీఓలు నరసింహారావు, 109 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 35 మందికి శుక్లం ఆపరేషన్ కొరకు సిఫార్స్ చేసారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హెచ్ ఎస్ లలో కంటి శక్లాల ఆపరేషన్ నిర్వహించబడునని చెప్పారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబు, పీఆర్.ఓ వందనం, సిబ్బంది గౌస్, గౌస్య లు పాల్గొన్నారు.
View More
Latest News
12 May 2025 08:33 AM
0
19
Newsread Image

No.1 Short News

Umar Fharooq
రమణాలవారిపాలెం లో ఘనంగా గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుక
తాళ్లూరు మండలంలోని రమణాలవారిపాలెం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుక ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం వారికి ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, కరీంభాష, నజీర్, మహాబువలి, తాతయ్య, బాబు, రాము, కొండ, శ్రీను, రామిరెడ్డి, బడా, సైదా, రియాజ్ పాల్గొన్నారు.
View More
Latest News
12 May 2025 08:33 AM
0
12
Newsread Image

No.1 Short News

Umar Fharooq
గుంటి గంగమ్మను దర్శించుకున్న కైపు వెంకటకృష్ణారెడ్డి
11/05/2025 ఆదివారం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం సోమవరప్పడు పరిధి లోని గుంటి గంగమ్మ తల్లి అమ్మవారు కు ఆదివారం కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు కూకట్ల వీరబ్రహ్మం ఆధ్వర్యంలో నెల పొంగల్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర అసంఘటిత ఉద్యోగుల చైర్మన్ శ్రీ కైపు వెంకటకృష్ణా రెడ్డి కూతురు తో పాల్గొన్నారు.
View More
Latest News
11 May 2025 16:19 PM
0
15
Newsread Image

No.1 Short News

Umar Fharooq
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలకు ఉదయం 4 గంటల నుండి 9గంటల వరకు త్రీ ఫేస్ కరెంట్
రేపు అనగా 12/5/2025 తేదీన ఉప్పలపాడు 132/33కేవీ సబ్ స్టేషన్ లో మెయింటినెన్స్ నిర్వహించినందున తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం, దోసకాయలపాడు, బొద్దికూరపాడు, లక్కవరం సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 4గంటల నుంచి 9గంటల వరకు త్రీ ఫేస్ సప్లై ఇస్తున్నారు. కావున రైతుల గమనించి సహకరించాలని కోరుతున్నాము. ఇట్లు దర్శి ఏడీఈ కృష్ణారెడ్డి
View More
Latest News
11 May 2025 16:19 PM
0
15
Newsread Image

No.1 Short News

Rasul.Sk
నేడు దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పండ్లు పంపిణీ
ఈ రోజు దివంగత నేత బూచేపల్లి సుబ్బారెడ్డి వర్థంతి సందర్భంగా.... మండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దళిత నాయకుడు పాలెపోగు డగ్లస్ గారి ఆధ్వర్యంలో పేదలకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమం లో బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గొప్పతనం గురించి చర్చించుకున్నారు..
View More
Latest News
11 May 2025 15:55 PM
1
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
గొట్టి పార్టీ లక్ష్మికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఈరోజు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ జన్మదిన సందర్భంగా భారీగా అభిమానులు, నాయకులు ,కార్యకర్తలు దర్శి చేరుకొని ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యువ నాయకుడు కరీముల్లా మాట్లాడుతూ గొట్టిపాటి లక్ష్మీ ఒకవైపు దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గా మరొకవైపు డాక్టర్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని, ఆమె ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి దర్శి చేరుకొని ఆమెకు దేవుని పటం అందించడం జరిగింది.
View More
Latest News
11 May 2025 15:55 PM
0
13
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
వివాహ శుభకార్యక్రమం లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
09-05-2025 న దర్శి మండలం, శేషంవారిపాలెం గ్రామం లో శుక్రవారం వివాహా శుభకార్యక్రం లో పాల్గొని నూతన వధూవరులు చి|| నరేష్ - చి|| ల|| సౌ|| అనూష లను ఆశీర్వాదించి, వివాహా శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ. ఈ కార్యక్రమం లో దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చిన్నా, మండల టిడిపి నాయకులు సానె సుబ్బయ్య, క్లస్టర్ అంకయ్య, శేషంవారిపాలెం గ్రామ టిడిపి నాయకులు, టిడిపి, జనసేన, బీజేపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 23:00 PM
0
26
Newsread Image

No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు మండలంలో వాహన తనిఖీలు
ముండ్లమూరు మండలంలోని శంకరాపురం లో శుక్రవారం సాయంత్రం ముండ్లమూరు ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ వాహన తనిఖీలు చేశారు. ప్రస్తుతం యుద్ద వాతావరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈ వాహన తనిఖీలు చేసినట్లుగా ఎస్సై చెప్పారు
View More
Latest News
09 May 2025 23:00 PM
0
18
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
యుద్ధ భూమిలో వీర మరణం పొందిన సైనికునికి ప్రభుత్వం అండగా ఉంటుంది
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటం జరుగుతుంది. ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది. ... డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి ఇంచార్జి దర్శి నియోజకవర్గం.
View More
Latest News
09 May 2025 19:51 PM
0
21
Newsread Image

No.1 Short News

Umar Fharooq
హంద్రీనీవా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగిన సీఎం చంద్రబాబు గారు. విస్తరణ, ఆధునీకరణ పనులపై అధికారులతో మాట్లాడి.పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
View More
Latest News
09 May 2025 17:40 PM
0
21
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులను కలిసిన పలాస జనసేన నాయకులు
ఈరోజు శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పలాస నియోజకవర్గ నాయకులు జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారిని కలిసి ఇటీవల నియోజకవర్గంలో జారిగిన కొన్నీ సంఘటనలు అధి నుంచి పార్టీకి కష్టకాలములో పార్టీలో పనిచేస్తున్న జనసేన నాయకులు అధ్వర్యంలో చెపడతున్న కార్యక్రమాలు గురించి చర్చించడo జరిగింది.జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోన కృష్ణారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దిలీప్ పాణిగ్రాహి,వజ్రపుకొత్తూరు క్లస్టర్ ఇంచార్జి దువ్వాడ వంశీకృష్ణ చౌదరి,జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు గిరీష్, విద్యాసాగర్, శంకు శ్రీకాంత్, ప్రదీప్, ఉదయ్, ఆనంద్ ఉన్నారు.
View More
Latest News
09 May 2025 17:40 PM
0
18
Newsread Image

No.1 Short News

Umar Fharooq
యుద్ధభూమిలో జవాన్ వీర మరణం
శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ ఈరోజు తెల్లవారుజామున 3.30 గం లకు జమ్మూకాశ్మీర్లో కాల్పులు జరగగా ఎంతో వీరోచితంగా పోరాడి 14 మందిని హతమార్చి తాను వీర మరణం పొందడం జరిగింది. ఈ వార్త విన్న మురళి తల్లిదండ్రులు తమకు ఒక్కడే కొడుకు కావడంతో శోక సంద్రంలో మునిగిపోయారు. కావున గ్రామస్తులు ప్రభుత్వం వారికి అండగా ఉండాలని కోరడం జరిగింది.
View More
Latest News
09 May 2025 17:07 PM
0
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
వీర జవాన్ కు న్యూస్ రీడ్ అశ్రునివాళులు
జమ్మూ కాశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పాక్‌ కాల్పుల్లో మృతి చెందిన జవాన్‌ మురళీ నాయక్‌.మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహం
View More
Latest News
09 May 2025 15:14 PM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
యాతం రమణారెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వృద్ధులకు అన్నదానం
దర్శి వాస్తవ్యులు యాతం రమణారెడ్డి సతీమణి ఆదిలక్ష్మి గార్ల33 వా పెళ్లిరోజు సందర్భంగా దర్శి కురిచేడు రోడ్డు లోని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము పండ్లు మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వారి కూతురు సురేఖ కుటుంబ సభ్యులు జంగా సుబ్బారెడ్డి మునగాల వెంకటనారాయణ చిన్నపరెడ్డి కట్టేకోట హరీష్ మరియు యాతం బ్రదర్స్ సన్స్ ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 13:41 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు పెళ్లి రోజు వేడుకలను జరుపుకుంటున్న విశాఖ ఎక్స్ డిప్యూటీ మేయర్, మరియు చైర్ పర్సన్ మునిసిపల్ స్టాండింగ్ కమిటీ విశాఖ పట్నం అయినటువంటి శ్రీ దాడి సత్యనారాయణ గారి దంపతులకు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ సంఘం జర్నలిస్టుల అందరి తరపున హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు...
View More
Latest News
09 May 2025 13:33 PM
0
14
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మధుసూదన్ సతీమణి కామాక్షి, వారి ఇద్దరు పిల్లలను కలిసిన మంచు విష్ణు, దాడి జరిగిన తీరును గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను. వారిని దత్తత తీసుకొని, వారి విద్యాభ్యాసం మరియు ఇతర అవసరాల కోసం నేను బాధ్యత వహిస్తాను అని విష్ణు హామీ ఇచ్చారు.
View More
Latest News
09 May 2025 09:14 AM
0
17
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
దర్శి: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా కపురంకు ఘన సన్మానం
ఈరోజు, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని దరిశిలోని స్థానిక తహశిల్దారు కార్యాలయ ప్రాంగణంలో, తహశిల్దార్ శ్రావణ్ కుమార్ అద్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహశిల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లడుతూ దరిశి ఏరియాలో ఐఆర్సీయస్ తరుపున మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ తరుఫున అనేక కార్యక్రమాలు నిస్వార్ధంగా నిర్వహిస్తున్న కపురం శ్రీనివాసరెడ్డిని ఈరోజు ఘనంగా సన్మానించడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దరిశి మండల గౌరవాధ్యక్షుడనైన నేను చాలా గర్వించదగిన విషయమని కపురం శ్రీనివాసరెడ్డి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో డీటీ వెంకట్,ఆరై శ్రీనివాసులు, వీ ఆర్వోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
View More
Latest News
09 May 2025 05:24 AM
0
14
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
వివాహా శుభకార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్ .
08-05-2025 ఈరోజు దర్శి మండలం, బట్టువారిపల్లి గ్రామంలో టిడిపి నాయకులు పూజల యోగయ్యా - సుబ్బులు కుమారుని వివాహా శుభకార్యక్రమానికి విచ్చేసి నూతన వధూవరులు చి|| శివ - చి||ల|| మౌనిక లను ఆశీర్వదించిన టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితోపాటు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య మరియు బట్టువారి పల్లె గ్రామంలోని టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
08 May 2025 22:09 PM
0
14
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ ప్రజలకు విన్నపము
దొనకొండలో గాలి బాగా వీచుతున్నది కరెంటు తీగలు ఎక్కడైనా మంటలు వస్తున్న తీగలు మీద ఎక్కడైనా చెట్టు కొమ్మలు. పడిన స్తంభాల దగ్గర ఎక్కడైనా మంటలు వచ్చిన కరెంటు తీగలు ఎక్కడైనా తెగిపడిన చూసిన వాళ్లు వెంటనే దయచేసి కరెంట్ ఆఫీస్ కి గాని మీకు తెలిసిన కరెంటు అధికారులకు గానీ ఫోన్ చేసి తెలియజేయగలరు Current Dkd: +919490615448‬ ‪Ae Donakonda Curent: +919440812246‬ ‪Ramakrishna Linmen: ‪+917659941607‬
View More
Breaking News
08 May 2025 18:54 PM
2
19
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ విజయం భారతీయుడు గర్వించదగ్గ విషయం - గులాం రసూల్
ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా జరగటం ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గులాంరసూల్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై చేసిన దాడికి తగిన బుద్ధి చెప్పిన భారత దేశ ప్రధాని మోడీ గారికి అదేవిధంగా భారత ఆర్మీ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. మరల మన దేశం వైపు ఎవరు కన్ను ఎత్తి చూడాలన్న భయాన్ని కలుగజేసి పహల్గాం దాడిలో మృతి చెందిన 21 మంది మృతులకు నిజమైన సంతాప సభను వారి ఆత్మను శాంతి కలగజేసిన భారత ఆర్మీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినరూ ప్రతి ఒక్క భారతీయుడు మన ఆర్మీ వారికి సెల్యూట్చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది చాలా గొప్ప విజయమని పేర్కొన్నారు.
View More
Latest News
08 May 2025 15:54 PM
1
22
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
నాపై ఎన్ని దాడులు చేసినా.. నన్నెవరూ ఆపలేరు - డా|| గొట్టిపాటి లక్ష్మి
బుధవారం బొట్లపాలెంలో జరిగిన తిరుణాలలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై గొట్టిపాటి లక్ష్మీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, కుల రాజకీయాలు మత రాజకీయాలు వర్గ రాజకీయాలు చేయటానికి రాలేదని, గతంలో ఇదే బొట్లపాలెంలో ఎన్నికలకు ముందు తన మీదకి కర్రలతో కత్తులతో దాడికి వచ్చారని, ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహిళ అనికూడా చూడకుండా అరాచకంగా ప్రవర్తించారని, అయినా కూడా ఇక్కడున్న మహిళలు పెద్దలు తనతోనే ఉన్నారని, ఎన్ని దాడులు చేసినా ఎన్ని అరాచకాలు సృష్టించిన నన్నెవరూ ఆపలేరు అని నేను అభివృద్ధి కోసం పని చేస్తున్నానని, ఓడినా గెలిచినా దర్శి లోనే ఉంటానని దర్శి ప్రజల కోసమే పని చేస్తున్నాననిని దర్శి అభివృద్ధి కోసమే అడుగులు వేస్తున్నానని అన్నారు.
View More
Local Updates
08 May 2025 09:43 AM
2
63
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
భారత్ మాతా కీ జై అంటూ గర్జించిన దర్శి తహశిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయ కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ ప్రతి చర్యను ప్రశంసించిన దర్శి తహసీల్దార్ భారత్ మాతా కీ జై అంటూ నిందించి యువతలో ఉత్సాహాన్ని నింపారు.
View More
Local Updates
08 May 2025 03:06 AM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ఆర్మీ ను అభినందిందిన దర్శి తహసీల్దార్ & ఎస్సై.
బుధవారం సాయంత్రం గం.5.00 లకు దర్శి పట్టణంలోని గడియార స్థంభం వద్ద దర్శి తహశీల్దారు వారి సమక్షములో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సిందూర్ చర్యలో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేయు నిమిత్తం అభినందన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర లో పాల్గొన్న ప్రతి సైనికునికి అభినందనలు తెలిపారు, అనంతరం భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
View More
Latest News
08 May 2025 02:56 AM
0
20
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
బ్రహ్మం గారి ఊరేగింపు లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
ఈరోజు దర్శి పట్టణం లో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన సందర్బంగా ఊరేగింపు కార్యక్రమం లో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు.
View More
Latest News
07 May 2025 22:06 PM
1
20
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక ఘట్టం - డా|| గొట్టిపాటి లక్ష్మి
ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పహల్గాం లో నరమేధానికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో 9 ఉగ్ర పోస్టులను ధ్వంసం చేయడంపై డాక్టర్ లక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం భారత్ మాతాకు జై అంటూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి జేజేలు పలకాలని మన టిడిపి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్ర మూకులను అంతం చేసేందుకు ఈ చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యువనేత లోకేష్ బాబు ఇటీవల జరిగిన అమరావతి సభలో కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి మోడీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్తావరాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కులమతాలకు అతీతంగా యావత్ భారతదేశం మోడీ తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం అన్నారు. భారత సైన్యానికి మనమందరం అండగా ఉందాం. ధైర్యంగా నిలబెడదాం. భారత్ మాతాకీ జై వందేమాతరం.
View More
Local Updates
07 May 2025 17:06 PM
0
61
Newsread Image

No.1 Short News

Newsread
వలి బాష కుటుంబానికి న్యాయం, రక్షణ ఏర్పాటు చేయాలి - ఫారుక్ షుబ్లీ
ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నందు వలిబాష కుటుంబాన్ని MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ పరామర్శించి మేమున్నాము అన్న భరోసా కల్పించారు. 4-5-2025న తెల్లవారుజామున నమాజుకు బయలుదేరిన వలి భాష అని క్రూరాతి క్రూరంగా నరికి చంపి వేసిన ఘటన ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది అన్న సంగతి అందరికి తెలిసిందే. షేక్ రెహనా మృతుడు వలిబాష భార్యమణి, షేక్ రుక్సాన మృతుడి చిన్న కూతురు, షేక్ ఫర్జానా పెద్ద కుమార్తె, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 5 సం||ల క్రితమే అనిల్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నించాడని అదే పని అతను చెప్పిన 5 సం||ల తరువాత చేసాడని భోరున వినిపించారు. ఇప్పుడు మమ్మల్ని సైతం చంపుతారని స్పష్టంగా బెదిరిస్తున్న పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి పూర్తిగా అండగా ఉండాలని రక్షణ కల్పించాలని అలాగే ఆ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుటుంబానికి ఏది జరిగిన పూర్తిగా పోలీసులదే బాధ్యత అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒక సగటు తండ్రి ఆవేదన అర్థం చేసుకొని ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినాది కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉందని అదే విధంగా ఆ రోజు తెల్లవారి జామున వలి భాషా సందులో కరెంటు తీసివేయటంలో ఆంతర్యం ఏమిటి? ఈ హత్య వెనకాల అనిల్ ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే మృతుడి ఆత్మ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించటం జరిగింది. అలాగే స్థానిక మంత్రి జనసేన నాయకులు కందుల దుర్గేష్ Kandula Durgesh గారు ఇప్పటి వరకు మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న గౌరవ రాష్ట్ర యువ నాయకులు మంత్రివర్యులు శ్రీ Nara Lokesh గారు వారి కార్యాలయం నుండి మృతుడి కుటుంబానికి అందుబాటులోకి రావడం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియచేయడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
View More
Latest News
07 May 2025 16:51 PM
1
17
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి లో భూకంపం, రెండు సెకన్ల పాటు కనిపించిన భూమి
ఏపీలో భూ ప్రకంపనలు.. ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి దర్శి, కురిచేడు, ముండ్లమూరు, దొనకొండ మండలాలలో కంపించిన భూమి ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన ప్రజలు
View More
Breaking News
06 May 2025 16:58 PM
10
299
Newsread Image

No.1 Short News

Newsread
మెగా డీఎస్సీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నారా లోకేష్ ఆదేశాలు జారీ
అమరావతి: జూన్ 6వతేదీ నుంచి మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో 3గంటలకుపైగా సమీక్షించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతోపాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.
View More
Breaking News
05 May 2025 23:52 PM
3
68
Newsread Image

No.1 Short News

Newsread
కదిరి కాంగ్రెస్ పార్టీ నూతన పట్టణ అధ్యక్షుడిగా షేక్ అల్లాబకష్.
ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, కదిరి నియోజకవర్గానికి సంబంధించిన పట్టణ మరియు మండల అధ్యక్షులు నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు షేక్ అల్లాబకష్ తనకి అవకాశం కల్పించి రాష్ట్ర అధ్యక్షురాలు ys షర్మిల రెడ్డి కి, CWC సభ్యులు రఘువీర రెడ్డి కి, కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ KS షానవాజ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలియజేశారు.
View More
Latest News
05 May 2025 15:31 PM
1
45
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: జన్మదిన శుభాకాంక్షలు
దర్శి ప్రజల ఆశా దీపం, ఎందరో యువతులకు ఆదర్శం, కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం కి మారుపేరు, దర్శి కి మార్గదర్శి, దర్శి నియోజకవక వర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి మాతృమూర్తి కి న్యూస్ రీడ్ యాప్ యాజమాన్యం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
View More
Local Updates
05 May 2025 12:04 PM
0
27
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
ముళ్ళ పొదల్లో దొరికిన అమ్మాయి, IAS కావడమే లక్ష్యం గా...
పూజా ఈమాన్: 2008లో తిరుపతి సమీపంలోని రేణిగుంటలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి ముళ్లపొదల్లో పడేయగా, స్థానికులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని రాజా ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాపను, సమీపంలో ఉన్న తల్లిని మైలవరంలోని రాజా ఫౌండేషన్‌కు తీసుకెళ్లారు.. ఆ చిన్నారికి మంచి పేరు పెట్టాలని కోరుతూ ఫౌండేషన్ నిర్వాహకుడు రాజారెడ్డి, అబ్దుల్ కలాంకు లేఖ రాయగా ఆయన పూజా ఈమాన్ అని నామకరణం చేశాడు. కొన్ని రోజులకు రాజారెడ్డి ఆ చిన్నారి పేరుతోనే ప్రొద్దుటూరు మండలం చౌడూరులో పూజా ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకూ అదే స్కూల్‌లో పూజా చదువుకుంది. పదో తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సాధించింది. ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ (హెచ్‌పీజీ)లో చేరింది.. ఫస్ట్ ఇయర్ 475కి 466, సెకండ్ ఇయర్‌లో 1000కి 985 మార్కులతో సత్తా చాటింది, ఇంటర్ చదివే సమయంలో రాజారెడ్డి కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది.. అనాథ అనే భావన రాకుండా రాజారెడ్డి సర్ నన్ను పెంచారు. నేను కలెక్టర్ కావాలనేది ఆయన కల, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుతా. పేదలకు, ప్రధానంగా నాలాంటి అనాథలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలన్నదే నా ధ్యేయం అని పూజా ఈమాన్ తెలిపింది.
View More
Motivation
05 May 2025 06:55 AM
3
169
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
అకాల వర్షాలు కురిసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. * చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం పొందకండి. * ఇంట్లో లేదా సురక్షితమైన భవనంలో ఉండండి. * బలమైన గాలుల వల్ల పడిపోయే అవకాశం ఉన్న వస్తువుల నుండి దూరంగా ఉండండి. News Read App లో మీ వార్తల కోసం 9948680044 కి కాల్ చేయగలరు.
View More
Latest News
05 May 2025 06:35 AM
1
31
Newsread Image

No.1 Short News

Newsread
RTC బస్సుల్లో phone pay ఫెయిల్, ఇబ్బంది పడ్డ మహిళలు.
విజయవాడ నుంచి మేదరమెట్ల వెళ్లేందుకు ముగ్గురు మహిళలు టికెట్ తీసుకుని, కండక్టర్ కి ఫోన్ పే చేయగా అమౌంట్ పే అయింది. టికెట్ రాలేదు, మళ్ళీ అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ చెప్పగా వారిలో ఒక అమ్మాయి వాగ్విదాం పెట్టుకోగా సదరు కండక్టర్ మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చేస్తా, ప్రస్తుతం మీ అమౌంట్ నేను ఇస్తాను అని మానవతా దృక్పథం చేయించటం . అయితే RTC తరపున ఏ తప్పిదం జరగలేదని కేవలం కండక్టర్, ఆ మహిళల మధ్య అవగాహన లోపం వల్లనే టెక్నికల్ ఎర్రర్ ఏర్పడిందినే ప్రయాణీకులు గుర్తించారు.
View More
Breaking News
04 May 2025 18:57 PM
3
39
Newsread Image

No.1 Short News

Newsread
మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ వేదిక
ఈరోజు మచిలీపట్నం లోని MR ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ముస్లిం వధూవరుల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మొత్తం 150 మంది కి పైగా వధూవరులు విచ్చేసి వారి ప్రొఫైల్ పరిచయకార్యక్రమంలో పాల్గొన్నారు. MR ఫంక్షన్ హాల్ అధినేత దాదా గారి ఆద్వర్యం లో LED స్క్రీన్స్ మీద వధూవరుల ప్రొఫైల్ ను ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణ తెచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసే ఆలోచన చేస్తున్నట్లు నిర్వాహకులు దాదా కుమార్తె, అల్లుడు మతీన్ తెలిపారు.
View More
Local Updates
04 May 2025 18:39 PM
6
70
Newsread Image

No.1 Short News

Newsread
విజయవాడ లో దంచి కొడుతున్న వర్షం
ఈరోజు ఉదయం నుంచి విజయవాడలో ఆకాశం మేఘావృతమైంది ఆకాశం అంతా మబ్బులతో నిండుకుండలా మారింది ఇప్పుడే వర్షం మొదలైంది మొదలవడంతోనే దంచి కొడుతున్న వర్షం, కుండపోతలాగా వర్షం దంచి కొడుతుంది.
View More
Latest News
04 May 2025 08:20 AM
0
37
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ఇంతమంది నాయకుల్లో మీడియా కు శుభాకాంక్షలు తెలిపిన రియల్ లీడర్
దర్శి లో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, చరిత్ర కలిగిన వారుకూడా ఉన్నారు, ఆ రాజకీయ నాయకుల్లో ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినం అని గుర్తించి, మీడియా యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఈరోజు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ఏకైక రియల్ లీడర్ కాంగ్రెస్ యువ నాయకుడు కైపు కృష్ణారెడ్డి. నాయకులలో మంచి మనసు ఉండాలి, అది కైపు కృష్ణారెడ్డి కి ఉంది అని చెప్పుకోవచ్చు.
View More
Local Ads
03 May 2025 21:37 PM
1
32
Newsread Image

No.1 Short News

Sk.Asma Reporter 9948680044
హజ్ యాత్రికులకు హామీ ఇచ్చిన సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి - ఫారూఖ్ షుబ్లీ
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లిం యాత్రికుడికి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీని త్వరితగతంగా అమలు చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లీ మైనార్టీ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ వర్యులు పెద్దలు శ్రీ NMD ఫరూఖ్ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి వెళ్లిన హాజీలకు మాత్రమే లక్ష రూపాయలు చెల్లిస్తామని మేనిఫెస్టో నందు పొందపరచలేదని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని గుర్తు చేశారు కాబట్టి హజ్ యాత్రకు వెళ్లిన ప్రతి హాజీకి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
View More
Latest News
03 May 2025 20:24 PM
2
34
Newsread Image

No.1 Short News

Newsread
ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఉండ తీవ్రంగా ఉండగా... సాయంత్రానికి చల్లబడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చర్లపల్లి, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
View More
Latest News
03 May 2025 19:25 PM
0
22
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel