దర్శి మోడల్ స్కూల్ లో దర్శి సిఐ రామారావు, దర్శి ఎస్ఐ మురళి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు, ఈ సందర్భంగా వ్యక్తిగత భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక విషయాలను వివరించారు, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు సరిగ్గా ఎదిగితే సమాజం పురోగమిస్తుందనీ, చదువులోనే కాకుండా నైతిక విలువల్లో కూడా ముందుండాలని వారు సూచించారు.